amrutasar: నడిరోడ్డుపై పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఆరెస్సెస్ నేతపై కాల్పులు... అక్కడికక్కడే మృతి

  • ఆరెస్సెస్ నేత విపిన్ శర్మ హత్య 
  • అతి దగ్గర నుంచి కాల్పులు
  • అక్కడికక్కడే మృతి చెందిన విపిన్ 

పంజాబ్ లో హత్యా రాజకీయాలకు తాజాగా ఆరెస్సెస్ నేత ఒకరు బలయ్యారు. ఆరెస్సెస్ అనుబంధ హిందూ సంఘర్ష్ సేన అమృత్ సర్ జిల్లా అధ్యక్షుడు విపిన్ శర్మను నిన్న అమృతసర్ పట్టణంలోనే దుండగులు కాల్చిచంపారు. స్థానిక మార్కెట్ ప్రాంతంలో రోడ్డుపై నిలబడి, బైక్ మీద వచ్చిన తన మిత్రుడితో కలసి విపిన్ మాట్లాడుతుండగా, గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆయనపై కాల్పులు జరిపారు.

మొదటి దుండగుడు కాల్చిన కాల్పులకు విపిన్ కిందపడిపోగా, మరో దుండగుడు వచ్చి ఆయనపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడు. పర్యవసానంగా అక్కడికక్కడే ఆయన ప్రాణాలు వదిలాడు. దీంతో బైక్ పై వచ్చిన మిత్రుడు ప్రాణభయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ పక్కనే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

amrutasar
shot
dead
  • Error fetching data: Network response was not ok

More Telugu News