rahul gandhi: మరో వికెట్ డౌన్... టీడీపీకి రాజీనామా చేసి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరిన సీతక్క

  • రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపిన సీతక్క
  • రాజకీయ ఏకీకరణ జరిగితేనే కేసీఆర్ ను అడ్డుకోగలమని వ్యాఖ్య
  • రాహుల్ సమక్షంలో నేడు కాంగ్రెస్ లో చేరిక

తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ పడిపోయింది. నిన్నటి వరకూ తాను టీడీపీలోనే ఉంటానని చెబుతూ వచ్చిన వరంగల్ జిల్లా మహిళా నేత సీతక్క, ఈ ఉదయం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు ఫ్యాక్స్ లో పంపిన ఆమె, ఆ వెంటనే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

ఢిల్లీకి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే, రాజకీయ ఏకీకరణ తప్పదని అన్నారు. కాగా, నేడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డితో పాటు సీతక్క కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు.

rahul gandhi
revant reddy
seetakka
  • Loading...

More Telugu News