siva sena: జాగ్రత్త మోదీ... రాహుల్ గాంధీ చెబుతున్నది ఇప్పుడు ప్రజలు వింటున్నారు: ఎంపీ సంజయ్ రౌత్

  • 2014 తరువాత రాహుల్ లో నాటకీయ మార్పులు
  • ఆయనో దేశానికి నేతగా మారుతున్నారు
  • శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

2014 తరువాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలో వచ్చిన నాటకీయ మార్పులు ఆయన్నో దేశ నేతను చేశాయని, ప్రజలు ఇప్పుడు ఆయన చెబుతున్న విషయాలను వినడం మొదలు పెట్టారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగం కావడం కోసం మాత్రమే బీజేపీని తాము భరిస్తున్నామని అన్న ఆయన, రాహుల్ గాంధీ నుంచి మోదీకి కష్టాలు ఎదురు కానున్నాయని అన్నారు.

మామూలుగా అయితే, మహారాష్ట్ర శివసేన నేతలు కాంగ్రెస్ లేదా ఎన్సీపీలను విమర్శిస్తుంటారు. కానీ, ఇటీవలి కాలంలో మాత్రం శివసేన బీజేపీపైన, నరేంద్ర మోదీపైన విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రాజ్ థాకరే మాట్లాడుతూ, గుజరాత్ లో బీజేపీ గెలిచిందంటే, అది ఈవీఎంల మహిమ మాత్రమేనని తాను నమ్ముతానని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగకుంటే గెలిచేది కాంగ్రెస్సేనని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

siva sena
sanjay rout
modi
rahul
  • Loading...

More Telugu News