jet airways: ఎయిర్ హోస్టెస్ కోసమే 'హైజాక్ లేఖ'... బిర్జూ మనసులోని మాట విని అధికారులు అవాక్కు!

  • నిన్న ముంబై - న్యూఢిల్లీ విమానంలో లేఖ
  • హైజాక్ చేయబోతున్నట్టు చెప్పిన బిర్జూ
  • అహ్మదాబాద్ లో అత్యవసర ల్యాండింగ్
  • గత సంవత్సరం కూడా వార్తల్లో నిలిచిన బిర్జూ

ముంబై నుంచి న్యూఢిల్లీ బయలుదేరిన విమానం టాయిలెట్ లో 'హైజాక్ లేఖ'ను ఉంచి తీవ్ర ఉద్రిక్తతకు కారణమైన బిర్జు కిశోర్ సల్లాను విచారించిన అధికారులు అవాక్కయ్యారు. తనకు జెట్ ఎయిర్ వేస్ తో గొడవలు ఉన్నాయని, సంస్థలో ఎయిర్ హోస్టెస్ గా ఉన్న ఓ యువతి కోసం ఈ పని చేశానని చెప్పాడు. ఆ యువతి విమానంలోనే ఉండటం చూసి, ఆమె తన దగ్గరికి రావాలన్న ఉద్దేశంతో, ఆమె ఉద్యోగం పోగొట్టే పరిస్థితి తేవాలని భావించానని, ఆపై ఈ పని చేశానని చెప్పాడు.

అంతేకాదు... బిర్జూ గత సంవత్సరం జూలైలో జెట్ విమాన సర్వీసులోనే ప్రయాణిస్తూ, తనకు ఇచ్చిన ఆహారంలో బొద్దింక కనిపించిందని ఆరోపించి నానా హంగామా చేశాడు. బిర్జూ గురించి పలు పత్రికల్లోనూ వార్తా కథనాలు వచ్చాయి. ఇక, నిన్న విమానాన్ని అహ్మదాబాద్ లో దింపిన తరువాత, ప్రతి ఒక్కరినీ కిందకు దించి, వారి ఫోటోలను తీసి, వారిని ప్రశ్నించి ఒక్కొక్కరినీ పంపిస్తున్న వేళ, బిర్జుపై వచ్చిన చిన్న అనుమానంతో మరింత లోతుగా విచారించగా, అసలు విషయం బయటపడింది.

jet airways
bomb threat
ahmedabad
mumbai
delhi
  • Loading...

More Telugu News