Transgender: లింగ మార్పిడి చేయించుకున్న అతడికి/ఆమెకు వేరే ఉద్యోగం ఇవ్వండి: నేవీ ఉద్యోగి కేసులో ఢిల్లీ హైకోర్టు

  • ఇదో అసాధారణ కేసన్న ధర్మాసనం
  • క్రమశిక్షణ రాహిత్యం కింద చర్యలు తీసుకుంటూనే ఉద్యోగం ఇవ్వాలని ఆదేశం
  • వచ్చే నెల 25కు విచారణ వాయిదా

లింగమార్పిడి చేసుకుని విధుల నుంచి ఉద్వాసనకు గురైన నేవీ ఉద్యోగి కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. లింగమార్పిడి ద్వారా మహిళగా మారిన ఆమెకు ప్రత్యామ్నాయ ఉద్యోగం ఇచ్చే విషయంలో ఆలోచించాలని కేంద్రానికి సూచించింది. ‘క్రమశిక్షణ రాహిత్యం కింద మీరు ఆమెను శిక్షించొచ్చు. కానీ అదే సమయంలో ఆమెకు మరో ఉద్యోగం కల్పించాలి’ అని జస్టిస్ జీఎస్ సిస్తానీ, వీకే రావులతో కూడిన ధర్మాసనం అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్‌కు సూచించింది. ఇటువంటి కేసును విచారించడం ఇదే తొలిసారని పేర్కొన్న కోర్టు ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించాలని సూచిస్తూ విచారణను నవంబరు 25కు వాయిదా వేసింది.

తనను విధుల నుంచి తప్పించడాన్ని సవాలు చేస్తూ అక్టోబరు 6న పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. తాను 2011 నుంచి గుర్తింపు పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు తనను బలవంతం చేసినప్పటి నుంచి లింగ పరంగా గుర్తింపు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News