ayyanna pathrudu: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంట్లో ర‌హ‌స్యంగా వాయిస్‌ రికార్డర్!

  • అయ్య‌న్న‌పాత్రుడి సోదరుడి కారు శుభ్రం చేస్తుండ‌గా దొరికిన వాయిస్ రికార్డ‌ర్‌
  • ప‌క్కా వ్యూహం ప్ర‌కారం దాన్ని అమర్చి పెట్టిన వైనం
  • కుటుంబ సభ్యుల్ని, పనివారిని విచారించిన‌ట్లు స‌మాచారం

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంట్లో ఎవ‌రో వాయిస్‌ రికార్డర్ పెట్టారు. ఒకే వాయిస్ రికార్డ‌ర్‌ని ఇంట్లోని ప‌లు చోట్ల పెట్టి, వాయిస్‌ను రికార్డు చేశారు. చివ‌ర‌కు ఆ వాయిస్ రికార్డ‌ర్ అయ్య‌న్న‌ పాత్రుడి సోదరుడు, పురపాలక వైస్‌ ఛైర్మన్‌ సన్యాసి పాత్రుడు వాహనంలో క‌న‌ప‌డింది. ఆ వాహ‌నంలో అత్యంత రహస్యంగా, ప‌క్కా వ్యూహం ప్ర‌కారం దాన్ని అమర్చి పెట్టారు. వాహనం శుభ్రం చేస్తుండగా ఈ విష‌యం బయటపడింది. అందులో రికార్డ‌యిన వాయిస్ ప్ర‌కారం దాన్ని అంతకు ముందు ఇంట్లోని ప‌లుచోట్ల కూడా ఉంచిన‌ట్లు తెలిసింది. ఈ ఘ‌ట‌న‌పై మంత్రి కుటుంబ సభ్యుల్ని, పనివారిని విచారించిన‌ట్లు స‌మాచారం.  

  • Loading...

More Telugu News