raviteja: రవితేజ కెరియర్లోనే ఫస్టు టైమ్ .. నైజామ్ లో 10 కోట్ల షేర్!

  • హిట్ జాబితాలో చేరిన 'రాజా ది గ్రేట్' 
  • తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల షేర్ 
  • రవితేజ తదుపరి చిత్రంగా 'టచ్ చేసి చూడు' 
  • త్వరలో సెట్స్ పైకి 'బోగన్' రీమేక్    

రవితేజ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'రాజా ది గ్రేట్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంధుడిగా రవితేజ నటించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి చోట ఘన విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 25 కోట్ల షేర్ ను సాధించింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 10 కోట్ల షేర్ ను రాబట్టింది.

 నైజామ్ లో రవితేజ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడం ఇదే ఫస్ట్ టైమ్ అని అంటున్నారు. చాలా గ్యాప్ తరువాత రవితేజ చేసిన ఈ సినిమా, ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం విశేషమని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా సక్సెస్ తెచ్చిన ఉత్సాహంతో .. రవితేజ 'టచ్ చేసి చూడు' సినిమా చేస్తున్నాడు. ఇక తమిళంలో విజయం సాధించిన 'బోగన్' సినిమా తెలుగు రీమేక్ లోను చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడు.      

  • Loading...

More Telugu News