ntr: లక్ష్మీ పార్వతి ఖర్చుల కోసం ఎన్టీఆర్ ఏం చేశారంటే... గుర్తు తెచ్చుకున్న జయప్రకాశ్ నారాయణ... వీడియో చూడండి!

  • తన ముందే జరిగిన ఘటనను గుర్తు చేసుకున్న జేపీ
  • ప్రజా ధనాన్ని సొంతానికి వెచ్చించని మహానేత
  • తన భార్యకు సొంత చెక్ తీసి ఖర్చులకు డబ్బిచ్చిన రామన్న
  • జనం మెచ్చిన జాతీయ నేత ఎన్టీఆర్ అన్న జయప్రకాశ్

ఆరు కోట్ల ఆంధ్రుల వెండితెర వేల్పుగా ఎదిగి, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉండి, తనను అభిమానించి, ప్రేమించిన లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్న సమయంలో ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఓ ఆసక్తికర ఘటనను ఐఏఎస్ మాజీ అధికారి, లోక్ సత్తా మాజీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ గుర్తు చేసుకున్నారు.

ప్రజా ధనాన్ని సొంతానికి వాడుకోడవడం అన్న మాటే ఎన్టీఆర్ ఎరుగరని, సొంత విలాసాలకు ఆయన ప్రభుత్వ డబ్బును రూపాయి కూడా ఖర్చు పెట్టేవారు కాదని గుర్తు చేసుకున్నారు. తాను సెక్రటరీగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ, తన భార్య లక్ష్మీ పార్వతి ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, సొంత చెక్కును ఆయన ఇచ్చారని, ఆ ఘటన తన ముందే జరిగిందని చెప్పారు. ఇటువంటి సంఘటనలే ఆయన కేవలం ముఖ్యమంత్రి కాదని, జనం మెచ్చిన జాతీయ నేతని రుజువు చేస్తుంటాయని జయప్రకాశ్ వ్యాఖ్యానించారు. జేపీ వ్యాఖ్యల వీడియోను మీరూ చూడవచ్చు.

ntr
lakshmi parvati
jayaprakash narayan
  • Loading...

More Telugu News