kcr: అటవీ శాఖలో ఇన్నేళ్లుగా ఉద్యోగ నియామ‌కాలు జ‌ర‌గ‌లేదు: సీఎం కేసీఆర్

  • తెలంగాణ అసెంబ్లీలో హ‌రిత‌హారంపై చ‌ర్చ
  • అడవుల ఆక్రమణలు ఆగకపోతే భవిష్యత్ తరాలు క్షమించ‌వు
  • అటవీ శాఖలో 50 శాతం ఖాళీలు ఉన్నాయి
  • ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తాం

అడవుల ఆక్రమణలు ఆగకపోతే భవిష్యత్ తరాలు క్షమించవని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో హ‌రిత‌హారంపై చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... అడవులు నరికితే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధ‌మ‌ని తెలిపారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో ఒక్క డిగ్రీ కళాశాల కూడా లేదని అన్నారు. అలాగే ఆ ప్రాంతంలో విద్యాసంస్థ‌లు నెలకొల్పుదామన్నా, మొక్కలు నాటుదామన్నా స్థలాలు లేవని తెలిపారు. గ‌త ప్ర‌భుత్వాల తీరే అందుకు కార‌ణ‌మ‌ని చెప్పారు.

అటవీ శాఖలో 50 శాతం ఖాళీలు ఉన్నాయని తెలిపిన కేసీఆర్‌.. ఆ శాఖ‌లో ఉద్యోగాల‌ నియామక ప్రక్రియ కసరత్తు మొదలుపెట్టామని తెలిపారు. గ‌త‌ ప్రభుత్వాల పాల‌న‌లో అటవీశాఖలో ఇన్నేళ్లుగా ఉద్యోగ నియామ‌కాలు జ‌ర‌గ‌లేద‌ని తెలిపారు. హరితహారం కార్యక్రమంలో అన్ని పార్టీల సభ్యులు పాల్గొనాలని కేసీఆర్ కోరారు. అటవీ శాఖలో ఏకంగా 50 శాతం ఖాళీలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ‌లో అన్యాక్రాంతమైన అటవీ భూములన్నీ వెనక్కి రావాలని కేసీఆర్ అన్నారు.

kcr
  • Loading...

More Telugu News