jet airways: విమానం టాయిలెట్లో 'చావుకేకల లేఖ' ఎవరు పెట్టారో తెలుసుకున్నామన్న కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు!

  • అతన్ని నిషేధిత వ్యక్తుల జాబితాలో పెట్టండి
  • ట్విట్టర్ ఖాతాలో సూచించిన కేంద్ర మంత్రి
  • ఘటన వెనుక సల్లా బిర్జూ

జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని బెదిరిస్తూ, టాయ్ లెట్లో లేఖ పెట్టి చావు కేకలు వినిపిస్తాయని బెదిరించింది ఎవరో తెలిసిపోయిందని విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు. విమానంలో హైజాకర్లు ఉన్నారని, పీఓకేకు విమానాన్ని మళ్లించాలని బెదిరించిన వ్యక్తిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్టు ఆయన తెలిపారు. అతని పేరును అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలూ తమ తమ నిషేధిత వ్యక్తుల జాబితాలో చేర్చాలని సూచించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు చేశారు.

 కాగా ఆ వ్యక్తి ఎవరన్న విషయాన్ని మంత్రి వెల్లడించకపోయినా, సల్లా బిర్జూ అనే వ్యక్తి ఈ పని చేసినట్టు తెలుస్తోంది. విమాన ప్రయాణాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో తాను ఈ పని చేసినట్టు పోలీసుల విచారణలో సల్లా అంగీకరించినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి వుంది. ముంబై నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన విమానంలో ఈ లేఖ దొరకడంతో, దాన్ని అహ్మదాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News