revant: రేవంత్ దగ్గరున్న అందరూ టీఆర్ఎస్ దగ్గరికొచ్చి, కాదంటే పోయినోళ్లే: ఎర్రబెల్లి కీలక వ్యాఖ్య

  • రేవంత్ నాలుగు పార్టీలు మారాడు
  • రేవంత్ పక్కనున్న వారితో ఇబ్బందుల్లేవు
  • పదవిపై ఆశలు లేవు
  • మీడియాతో ఎర్రబెల్లి దయాకర్ రావు

ఇప్పటివరకూ రేవంత్ రెడ్డి నాలుగు పార్టీలను మారాడని, ఆయన ఏ పార్టీలో ఉన్నా ఒకటేనని గతంలో తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎర్రబెల్లి దయాకరరావు వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం రేవంత్ రెడ్డి వెంట ఉన్న నేతలంతా గతంలో టీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపించి, సంప్రదించిన వారేనని అన్నారు. టీఆర్ఎస్ లో అవకాశాలు లేవని తెలుసుకుని ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళుతున్నారని, అలాంటి వారితో తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని అన్నారు. ఎన్నికలు మరో ఏడాదిన్నరలో జరగనున్న తరుణంలో ఇప్పుడు తనకు ఏ విధమైన పదవులూ వద్దని, పదవిపై అసలు ఆశ కూడా లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అంశంపై ఎన్నికల ముందు పరిస్థితిని బట్టి ఆలోచిస్తామని ఎర్రబెల్లి తెలిపారు.

revant
yerrabelli
congress
TRS
Telugudesam
  • Loading...

More Telugu News