trump: హెచ్-1బీ వీసాలకు దరఖాస్తు చేయకుండా 17 కంపెనీలపై నిషేధం... కంపెనీల పేర్లివి!

  • జాబితాను విడుదల చేసిన సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్
  • అమెరికన్ ఉద్యోగుల భద్రత కోసమే
  • ట్రంప్ ప్రధాన ఉద్దేశమదేనన్న యూఎస్ సీఐఎస్

అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేయాలని కలలు కనేవారిపై డొనాల్డ్ ట్రంప్ విధించిన తాజా నిబంధనల తరువాత మరో 17 కంపెనీలు హెచ్-1బీ వీసాలకు దరఖాస్తు చేయకుండా నిషేధం అమలులోకి వచ్చింది. యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) ఈ కంపెనీల జాబితాను విడుదల చేసింది. అమెరికా కార్మికులకు ఉద్యోగ భద్రతను పరిరక్షించడమే ట్రంప్ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా యూఎస్ సీఐఎస్ పేర్కొంది.

ఇక తాజాగా నిషేధం విధించబడ్డ కంపెనీల్లో...

ఏజిల్ టెక్నాలజీస్ (నిషేధం 24-12-2018 వరకు), అమికా టెక్నాలజీ సొల్యూషన్స్, ఎల్ఎల్సీ (నిషేధం 24-7-2019 వరకు), క్లిన్ రాన్ ఎల్ఎల్సీ (నిషేధం 20-9-2018 వరకు), డెల్టా సెర్చ్ ల్యాబ్స్, ఐఎన్సీ (నిషేధం 20-9-2018 వరకు), ఫాస్కామ్ డిజిటల్ టెక్నాలజీస్, ఎల్ఎల్సీ (నిషేధం 24-7-2018 వరకు), జీ హెల్త్ కేర్ ఎల్ఎల్సీ (నిషేధం 24-12-2018 వరకు), ఇన్ కాల్న్ కార్పొరేషన్, ఐఎన్సీ  (నిషేధం 24-12-2018 వరకు), ఎండీ2 సిస్టమ్స్, ఐఎన్సీ (నిషేధం 13-11-2018 వరకు), నార్త్ రన్ కాలిఫోర్నియా యూనివర్సల్ ఎంటర్ ప్రైజ్ కార్పొరేషన్ (నిషేధం 13-4-2019 వరకు), ఎన్వైసీ హెల్త్ కేర్ స్టాఫింగ్, ఎల్ఎల్సీ (నిషేధం 9-4-2018 వరకు), పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్ (నిషేధం 15-12-2017 వరకు), రైడ్ స్ట్రా డెయిరీ లిమిటెడ్ (నిషేధం 10-4-2018 వరకు), తెలవా నెట్ వర్క్స్, ఐఎన్సీ (నిషేధం 24-12-2018 వరకు), టెక్ వైర్ సొల్యూషన్స్ ఐఎన్సీ (నిషేధం 3-4-2018 వరకు), యూనీవాల్యూ క్రియేషన్స్ ఎల్ఎల్సీ (నిషేధం 24-12-2017 వరకు), యుమ్మీ ఎంటర్ ప్రైజస్, ఐఎన్సీ (నిషేధం 24-12-2017 వరకు), మాక్రో నెట్ వర్క్స్ కార్పొరేషన్ (నిషేధం 24-7-2018 వరకు) ఉన్నాయి.

  • Loading...

More Telugu News