Pakistan: పాకిస్థాన్‌ వెన్నువిరిచే వ్యూహానికి పదును పెడుతోన్న భార‌త్!

  • సముద్ర తీరాల్లో జరిగే యుద్ధాల్లో ముఖ్య‌పాత్ర పోషించే సబ్‌మెరైన్లు
  • పాక్ వ‌ద్ద భార‌త‌ సబ్‌మెరైన్ల జాడ‌ను ప‌సిగ‌ట్టే అమెరికాకు చెందిన‌ పి-3సీ విమానాలు
  • సబ్‌మెరైన్ల జాడ‌ను పాక్‌ ప‌సిగ‌ట్టకుండా పి-3సీపై ప‌ట్టుసాధిస్తోన్న‌ భారత్‌
  • జ‌పాన్‌తో క‌లిసి సంయుక్త విన్యాసాలు

భార‌త్ ప‌ట్ల విషం క‌క్కుతూ దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోన్న పాకిస్థాన్‌పై కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారిస్తోంది. పాక్ చ‌ర్య‌ల‌ను దీటుగా ఎదుర్కునేలా అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటోంది. సముద్ర తీరాల్లో జరిగే యుద్ధాల్లో ముఖ్య‌పాత్ర పోషించే అత్యుత్తమ స్థాయి సబ్‌మెరైన్లను భార‌త్ ఎప్పుడో సమకూర్చుకుంది. అయితే, వాటిని గుర్తించి ధ్వంసం చేసే అమెరికాలోని 'లాక్‌హీడ్‌ మార్టీన్‌' సంస్థ నుంచి పి-3సీ విమానాలను 1996లో పాకిస్థాన్ కొనుగోలు చేసింది. అప్పటి నుంచీ ఈ విమానాలను అప్‌గ్రేడ్‌ చేయిస్తూ వ‌స్తోంది.

మరోపక్క, ఈ విమానాలకు స‌మాచారం అంద‌కుండా భార‌త్‌ సబ్‌మెరైన్లను అప్‌గ్రేడ్‌ చేసుకుంటోంది. పి-3సీలోని వ్యవస్థల పనితీరు తెలుసుకుని దానికి తగినట్లు సబ్‌మెరైన్ల సంచారాన్ని మార్చుకోవాలని భారత నేవీ
ప్లాన్ వేసింది. అలాగే జపాన్‌తో కలిసి సంయుక్త యుద్ధవిన్యాసాలు చేసింది. జపాన్‌ కూడా పి-3సీ నిఘా విమానాలను వినియోగిస్తుండ‌డంతో యుద్ధ విన్యాసాల్లో భాగంగా వాటిని భారత సిబ్బంది కూడా వినియోగిస్తారు.

దీంతో పి-3సీపై భారత సిబ్బందికి పట్టువస్తుంది. ఈ విమానాలు గోవాలోని ఐఎన్‌ఎస్‌ హంసాకి చేరుకున్నాయి. భారత్‌ తరపున పీ-8ఐ నిఘా విమానాలు ఈ విన్యాసాల్లో పాలు పంచుకున్నాయి. భార‌త స‌బ్‌మెరైన్ల క‌ద‌లిక‌ల‌ను పాక్ క‌నిపెట్ట‌కుండా చేసేలా భారత నావికాదళం చ‌ర్య‌లు తీసుకుంటోంది.  

  • Loading...

More Telugu News