helicopter door: హెలికాప్ట‌ర్ డోర్ విరిగి.. ఇంటిపై పడింది!

  • హెలికాప్ట‌ర్ డోర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • భ‌యాందోళ‌న‌ల‌కు గురైన‌ యాద‌వ‌బ‌స్తీ వాసులు

హైద‌రాబాద్ లాలాపేట్‌లో అల‌జ‌డి చెల‌రేగింది. ఆ ప్రాంతంలోని యాద‌వ‌బ‌స్తీలో ఓ ఇంటిపై ఏదో ప‌డిన‌ట్లు పెద్ద శ‌బ్దం వ‌చ్చింది. భ‌యాందోళ‌న‌ల‌కు గురైన‌ స్థానికులంతా గూమిగూడి ఇంటిపై ఏం ప‌డింద‌ని ప‌రిశీలించ‌గా అది హెలికాప్ట‌ర్ డోర్ అని గుర్తించారు. ఈ స‌మాచారం అందుకుని అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు హెలికాప్ట‌ర్ డోర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆకాశంలో వెళుతుండగా శిక్ష‌ణ హెలికాప్ట‌ర్ డోర్ విరిగిప‌డింద‌ని గుర్తించారు. పెద్ద శబ్దంతో ఒక్క‌సారిగా అది వ‌చ్చి ప‌డ‌డంతో భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యామ‌ని స్థానికులు చెప్పారు. ఈ ఘ‌ట‌న వ‌ల్ల యాద‌వ‌బ‌స్తీలోని ఆ ఇంటికి ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని తెలుస్తోంది.  

  • Loading...

More Telugu News