madhavaram krishnarao: శని చుట్టుకోబట్టే రేవంత్ ను తీసుకున్నారు: కాంగ్రెస్ పై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

  • రేవంత్ ఓ ఐరన్ లెగ్
  • తెలంగాణలో టీడీపీని నాశనం చేశాడు
  • ఆరేళ్లలో పార్టీని భ్రష్టు పట్టించాడు
  • మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ బీ ఫార్మ్ పై గెలిచి, టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ను ఐరన్ లెగ్ గా అభివర్ణించిన ఆయన, తెలంగాణలో టీడీపీ నాశనం కావడానికి ఆయనే కారణమని అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి శని పట్టుకోవడం వల్లే రేవంత్ ను ఆహ్వానించారని, టీడీపీలోకి వచ్చిన ఆరేళ్లలోనే పార్టీని భ్రష్టు పట్టించిన ఘనత ఆయనదేనని ఎద్దేవా చేశారు. తమవంటి నేతలు మూడు దశాబ్దాల పాటు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయగా, రేవంత్ వంటి వ్యక్తులు దాన్ని నిమిషాల్లో సర్వనాశనం చేశారని నిప్పులు చెరిగారు. రేవంత్ తన భాషను మార్చుకోవాలని, లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News