revant reddy: అసెంబ్లీలో రేవంత్ నేమ్ బోర్డును తొలగించిన టీడీపీ

  • ఇంకా వెలువడని రేవంత్ రాజీనామా ఆమోద ప్రకటన
  • టీడీఎల్పీ గది ముందు నేమ్ బోర్డు తొలగింపు
  • రెండు రోజుల క్రితమే రేవంత్ రాజీనామా

రేవంత్ ఇక తమ పార్టీలో లేనట్టేనని తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా, అనధికార సంకేతాలను మాత్రం వెలువరించింది. తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉన్న ఆయన నేమ్ ప్లేట్ ను టీడీపీ గది ముందు నుంచి తొలగించేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గానూ రేవంత్ బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయన రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తరువాత తాజాగా టీడీఎల్పీ కార్యాలయం గోడకు ఉన్న ఆయన నామఫలకాన్ని తీసేశారు. రేపు రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇంతవరకూ రేవంత్ రాజీనామాను ఆమోదిస్తున్నట్టు ఎటువంటి అఫీషియల్ ప్రకటనా వెలువడలేదు.

revant reddy
congress
Telugudesam
assembly
  • Loading...

More Telugu News