anupama parameshwaran: నాకూ లైంగిక వేధింపులు తప్పలేదు... సంచలన కామెంట్లు చేసిన అనుపమా పరమేశ్వరన్

  • ప్రతి అమ్మాయికీ అనుభవమే
  • 'మీటూ' ప్రచారంపై స్పందించిన అనుపమ
  • వేధింపులు ఎదురైతే హెచ్చరించి వదిలేస్తుంటా
  • పురుషుల పనులతో ఎంతో చిరాకు

తాము లైంగిక వేధింపులకు గురయ్యామని ఒప్పుకుని నలుగురి ముందూ ఆ విషయాలను బయట పెడుతున్న సెలబ్రిటీల జాబితాలో అందాల హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కూడా చేరిపోయింది. వేధింపులపై ప్రపంచవ్యాప్తంగా 'మీటూ' ప్రచారం జోరుగా సాగుతున్న వేళ, దానిపై స్పందిస్తూ, ప్రతి అమ్మాయీ జీవితంలో వేధింపులు ఎదుర్కొంటుందని, తనకు తెలియకుండానే కొన్నిసార్లు ఇవి జరిగిపోతుంటాయని అనుపమ చెప్పింది.

అందుకు ఉదాహరణలు వివరిస్తూ, బస్సులో కండక్టర్ తాకుతూ వెళ్లవచ్చని, తన జీవితంలోనూ పలుమార్లు ఇటువంటి వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పింది. మాటలతో వేధించేవాళ్లు, తప్పుడు చూపులు చూసేవారు, అవసరం లేకున్నా దగ్గరకు వచ్చి తాకాలని చూసేవాళ్లు తనకు ఎంతో మంది ఎదురయ్యారని, చాలా సార్లు దూరం జరగాలని హెచ్చరిస్తుండే దాన్నని వెల్లడించింది.

ఆ సమయంలో పురుషులకు కలిగే ఆనందం ఏంటో తనకు తెలియడం లేదని చెప్పింది. వారు చేసే పనులు ఎంతో చిరాకును తెప్పించేవని, ఎంతో మంది ఆడవాళ్లకు ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందన్న సంగతి తనకు తెలుసునని పేర్కొంది. ఇక పురుషుల చూపులు తమను ఎంత బాధపెడతాయో అర్థం చేసుకోవాలని, వారికి కూడా ఓ తల్లి, ఓ సోదరి ఉంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సలహా ఇచ్చింది.

anupama parameshwaran
# me too
harrasment
  • Loading...

More Telugu News