anasuya: 'సచ్చిందిరా గొర్రె' అంటూ సంబరపడుతున్న యాంకర్ అనసూయ!

  • శ్రీనివాసరెడ్డి, టిల్లు వేణులతో కలసి నటిస్తున్న అనసూయ
  • నల్గొండలో పుట్టినా తెలంగాణ యాస తెలియని అనసూయ
  • ఈ సినిమాతో యాస తెలిసిదంటూ ఆనందిస్తున్న హాట్ యాంకర్

ప్రస్తుతం కమేడియన్ శ్రీనివాసరెడ్డి, టిల్లు వేణు ముఖ్య నటులుగా నటిస్తున్న 'సచ్చిందిరా... గొర్రె' చిత్రంలో హీరోయిన్ గా చాన్స్ కొట్టేసిన అనసూయ ఇప్పుడు తనకు తెలంగాణ యాస వచ్చేసిందని సంబరపడుతోంది. తాను నల్గొండ అమ్మాయినే అయినా, హైదరాబాద్ లో పెరిగానని, అందువల్ల ఇక్కడి మాటతీరే వచ్చిందని చెప్పుకున్న అనసూయ,'సచ్చిందిరా... గొర్రె' సెట్స్ లో తనకు తెలంగాణ యాస వచ్చేసిందని, అందుకెంతో ఆనందంగా ఉందని అంటోంది. వినోదాత్మకంగా సాగే చిత్రం ఇదని, తెరపై ఓ అందమైన అనుభవంలా ఉంటుందని చిత్ర దర్శకుడు శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. డిసెంబర్ నాటికి సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని, ఆపై పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించి, విడుదల చేస్తామని ఆయన అన్నారు.

anasuya
sachindiraa gorre
srinivasa reddy
  • Loading...

More Telugu News