revant reddy: రేవంత్ కోసం కదిలిన కన్నడ మంత్రి... కర్ణాటక భవన్ లో 30 గదులు రేవంత్ పేరిట బుక్ చేసిన వైనం!

  • ఏపీ భవన్ లో రేవంత్ కు గదులివ్వని అధికారులు
  • విషయం తెలుసుకుని స్పందించిన కన్నడ మంత్రి
  • ఆయన చెప్పగానే 30 గదులు రేవంత్ పేరిట
  • కర్ణాటక భవన్ లో ఇప్పుడు తెలుగు సందడి

ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ లో రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులకు గదులు లభించని వేళ, ఓ ప్రముఖ కన్నడ మంత్రి కదిలొచ్చారు. కర్ణాటక భవన్ లో ఏకంగా 30 గదులను రేవంత్ పేరిట ఆయన బుక్ చేసినట్టు తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం, రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి చేరనుండటంతో, కన్నడ భవన్ వద్ద ఇప్పుడు తెలుగు సందడి కనిపిస్తోంది. ఈ ఉదయానికే ఢిల్లీ చేరుకున్న కొందరు రేవంత్ అనుచరులు, రేపటి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. రేపు రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్న సంగతి తెలిసిందే. కాగా, ఈ మధ్యాహ్నం వరకూ హైదరాబాద్ లో తన కార్యకర్తలతో సమావేశమయ్యే రేవంత్, ఆపై ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఆయన వెంట ఓ 20 మంది వరకూ నేతలు ఢిల్లీ వెళతారని తెలుస్తోంది.

revant reddy
delhi
kannada bhavan
  • Loading...

More Telugu News