revant reddy: నేతలు, అభిమానులతో కిక్కిరిసిన రేవంత్ రెడ్డి నివాసం!

  • జలవిహార్ లో సభకు పోలీసుల అనుమతి నిరాకరణ
  • ఇంటి వద్దే అభిమానులతో సమావేశం కానున్న రేవంత్
  • ఇప్పటికే నిండిపోయిన రేవంత్ నివాసం

తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి, హైదరాబాద్ నివాసం ఇప్పుడు నేతలు, అభిమానులతో కిక్కిరిసిపోతోంది. నేడు జలవిహార్ లో అభిమానులు, కార్యకర్తలతో సమావేశం అయ్యేందుకు అనుమతి కోరగా, అసెంబ్లీ సమావేశాలను కారణంగా చూపిన పోలీసులు, అనుమతులు నిరాకరించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తన ఇంటి వద్దే భేటీ అవుదామని చెబుతూ, 2 వేల మందికి రేవంత్ ఆహ్వానం పంపగా, దాదాపు 5 నుంచి 10 వేల మంది వరకూ వస్తారని అంచనా. ఇప్పటికే ఆయన నివాసం వద్ద 1,500 మందికి పైగా కార్యకర్తలు, పలు జిల్లాల నుంచి వచ్చిన చోటా నేతలు హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ కు మద్దతుగా పలువురు రాజీనామాలు చేయగా, మరికొందరు ఇవాళ, రేపు రాజీనామాలు చేస్తారని సమాచారం. ఇక నేడు కార్యకర్తలతో సమావేశం అనంతరం ఢిల్లీకి వెళ్లే రేవంత్, రేపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో అధికారికంగా చేరనున్నారు.

revant reddy
congress
jalavihar
meeting
  • Loading...

More Telugu News