revant reddy: సండ్ర వెంకట వీరయ్యకు ప్రమోషన్... టీడీపీఎల్పీ నేత పదవి ఆయనదే!

  • కలిసొచ్చిన రేవంత్ రాజీనామా
  • అసెంబ్లీలో మిగిలేది కృష్ణయ్య, సండ్రలు మాత్రమే
  • టీడీపీ టీమ్ కు సండ్ర నేతృత్వం
  • నేడు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం

రేవంత్ రెడ్డి తన పదవులకు రాజీనామా చేయడం తెలుగుదేశం పార్టీ మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కలిసొచ్చింది. రేవంత్ రాజీనామాతో ఖాళీ అయిన తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నేత పదవి ఆయనకు దక్కనుంది. తెలుగుదేశం పార్టీ నుంచి మరో ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య కూడా ఉన్నప్పటికీ, ఆయన క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనక పోవడం, టీడీపీకి అంటీముట్టనట్టుగా ఉంటుండటంతో టీడీపీఎల్పీ పదవి సండ్రదేనని, ఈ మేరకు రేపు ఓ ప్రకటన వెలువడుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

 వాస్తవానికి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది శాసన సభ్యులుగా విజయం సాధించగా, వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, తదితర 12 మంది తెలుగుదేశం పార్టీలో చేరిపోగా, నిన్నటి వరకూ రేవంత్, సండ్ర, కృష్ణయ్య మిగిలారు. ఈ టీమ్ కు అసెంబ్లీలో రేవంత్ నాయకత్వం వహిస్తున్నారు. ఇక రేవంత్ తప్పుకోవడంతో ఉన్న ఇద్దరిలో ఒకరికి టీడీపీఎల్పీ దక్కనుండగా, ఆ అవకాశం సండ్రదేనని తెలుస్తోంది.

revant reddy
congress
sandra
r krishnaiah
  • Loading...

More Telugu News