ac/non ac bus: బస్సు ఒకటే... సగం ఏసీ, సగం నాన్ ఏసీ... ఏపీఎస్ ఆర్టీసీ కొత్త సర్వీసులు ప్రారంభం

  • విజయవాడ - ఒంగోలు మధ్య కొత్త సర్వీసులు
  • నేటి నుంచి ప్రారంభం
  • ఆదరణను బట్టి మరిన్ని సర్వీసులన్న అధికారులు

మరింత మంది ప్రయాణికులను ఆకర్షించేందుకు నూతన మార్గాలను అన్వేషిస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ మరో సరికొత్త వెరైటీ సర్వీసులను ప్రారంభించింది. అనునిత్యం అత్యంత రద్దీగా ఉండే విజయవాడ, ఒంగోలు మధ్య ఏసీ కమ్ నాన్ ఏసీ బస్సులను నేటి నుంచి ప్రవేశపెట్టింది. ఈ బస్సులో వెనుక నుంచి 21 సీట్లు విడిగా, ఓ కంపార్టుమెంట్ లో ఉంటాయి. వాటికి ఏసీ ఉంటుంది.

ఏసీ కంపార్టుమెంటులో రెండు ఎల్ఈడీ టీవీలను అమర్చారు. ఏసీ ప్రయాణికులకు వాటర్ బాటిల్ ను కూడా అందించనున్నట్టు అధికారులు తెలిపారు. ముందువైపు సూపర్ లగ్జరీలో ఉన్నటు వంటి సీట్ల అమరిక ఉంటుంది. ఈ బస్సులను ప్రస్తుతం ప్రయోగాత్మకంగా నడుపుతున్నామని, ప్రయాణికుల నుంచి వచ్చే ఆదరణను చూసి మరిన్ని బస్సులను, ఇతర మార్గాల్లోనూ నడుపుతామని అధికారులు పేర్కొన్నారు.

ac/non ac bus
vijayawada
apsrtc
  • Loading...

More Telugu News