revant reddy: మీడియాతో రెండే ముక్కలు మాట్లాడిన రేవంత్!

  • కార్యకర్తలతో మాట్లాడాల్సింది ఉంది
  • ఇక అసెంబ్లీకి కూడా వెళ్లను
  • రేపు మీడియాతో మాట్లాడతాను
  • రేవంత్ రెడ్డి

రేవంత్ మీడియాతో మాట్లాడతారని, తాను తెలుగుదేశం పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చిందో స్పష్టంగా తెలియజేస్తారని ఎదురుచూసిన నేషనల్, స్టేట్ మీడియాకు నిరాశ ఎదురైంది. ఈ ఉదయం తన ఇంటి నుంచి బయటకు వచ్చిన రేవంత్, మీడియాతో రెండే రెండు ముక్కలు మాట్లాడి వెళ్లిపోయారు. తాను నేడు కార్యకర్తలతో సమావేశం కావాల్సి వుందని, ప్రతి ఒక్కరితో విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు తీసుకోవాల్సి వుందని చెప్పిన రేవంత్, రేపు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడతానని తెలిపారు. సోమవారం నుంచి అసెంబ్లీకి కూడా వెళ్లనని చెప్పిన ఆయన, తనను అర్థం చేసుకోవాలని మీడియాను కోరారు.

revant reddy
congress
Telugudesam
media
  • Loading...

More Telugu News