revant reddy: తదుపరి పనులను చకచకా చక్కబెడుతున్న రేవంత్!

  • పీఏను పంపించేసిన రేవంత్
  • మధ్యాహ్నం గన్ మెన్ ల సరెండర్
  • రేపు జలవిహార్ లో సభ
  • ఆపై ఢిల్లీకి పయనం

తెలుగుదేశం పార్టీ పదవులకు, సభ్యత్వానికీ నిన్న రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి, తదుపరి తాను చేయాల్సిన పనులను చకచకా చక్కబెడుతున్నారు. ప్రభుత్వం నియమించిన తన పర్సనల్ అసిస్టెంట్ ను ఈ ఉదయం ఆయన పంపించి వేశారు. మధ్యాహ్నం తన గన్ మెన్ లను వికారాబాద్ ఎస్పీ వద్ద సరెండర్ చేయనున్నానని ఆయన తెలిపారు. మరో నెల రోజుల్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ ను ఖాళీ చేస్తానని కూడా తెలిపారు.

రేపు ఉదయం 10 గంటలకు పెద్దమ్మ గుడిలో పూజలు నిర్వహించి, ఆపై నక్లెస్ రోడ్, జలవిహార్లో అన్ని జిల్లాలు, నియోజకవర్గ స్థాయి నేతలతో భేటీ నిర్వహించనున్నట్టు రేవంత్ ముఖ్య అనుచరులు వెల్లడించారు. ఆ తరువాత మధ్యాహ్నం నుంచి ఆయన ఢిల్లీకి వెళతారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి భవిష్యత్ ప్రణాళికలు ముందే రూపొందించుకున్న తీరు చూస్తుంటే, ఆయన పార్టీ మారాలని ఎన్నడో నిర్ణయించేసుకున్నట్టు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

revant reddy
congress
Telugudesam
chandrababu
  • Loading...

More Telugu News