raj thakare: గుజరాత్ లో బీజేపీ ఓడిపోవచ్చు: రాజ్ థాకరే సంచలన వ్యాఖ్య

  • గెలిస్తే ఈవీఎంల పుణ్యమే
  • జనాలు లేని మోదీ సభలు
  • గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు
  • ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే

డిసెంబరులో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో బీజేపీకి 150 సీట్లు దాటితే అది ఈవీఎంలు చేసిన అద్భుతంగానే భావిస్తానని అన్నారు.

 "రీసెంట్ ట్రెండ్, వస్తున్న నివేదికలు రాష్ట్రంలో అధికార పార్టీ ఓడిపోనున్నదని తెలిసిపోతోంది. మోదీ మీటింగులకు సంబంధించిన ఫొటోలు కూడా సంతృప్తికరంగా కనిపించడం లేదు. చాలా మంది ఆయన మాట్లాడుతుంటే లేచి వెళ్లిపోతున్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. మోదీ పాల్గొంటున్న సభలు ఓ స్పష్టమైన సందేశాన్ని పంపుతున్నాయి. బీజేపీ గెలిచిందంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల మహిమేనని నేను నమ్ముతాను" అన్నారు. కాగా, డిసెంబర్ 9, 14 తేదీల్లో 182 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

raj thakare
modi
gujarath
elections
  • Loading...

More Telugu News