revant reddy: మ‌రో షాక్‌.. రేవంత్ రెడ్డితో పాటు టీడీపీకి రాజీనామా చేసిన వేం న‌రేంద‌ర్ రెడ్డి

  • వరంగల్‌ జిల్లాలో ముఖ్య‌ నేత వేం నరేందర్‌ రెడ్డి
  • గండ్ర సత్యనారాయణరావు, ఉమా మాధవరెడ్డి,  సీతక్క కూడా పార్టీ మార‌తార‌ని ప్ర‌చారం

టీడీపీకి, త‌న శాస‌న‌స‌భ స‌భ్య‌త్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఒక‌వేళ రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే ఆయ‌న‌తో పాటు వెళ్లే నేత‌ల్లో ప్ర‌ధానంగా వినిపించిన పేరు వేం న‌రేంద‌ర్ రెడ్డి. వరంగల్‌ జిల్లాలో ముఖ్య‌నేత అయిన వేం నరేందర్‌ రెడ్డి కూడా తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. వేం న‌రేందర్ రెడ్డితో పాటు భూపాలపల్లి జిల్లాలో బలమైన నేతగా ఉన్న గండ్ర సత్యనారాయణరావు, నల్గొండ జిల్లా నుంచి పోలిట్‌ బ్యూరో సభ్యురాలు ఉమా మాధవరెడ్డి, సీతక్కతో పాటు ప‌లువురు పార్టీ మార‌తార‌ని ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది.  

revant reddy
congress
Telugudesam
chandrababu
  • Loading...

More Telugu News