TG Venkatesh: చంద్ర‌బాబు, కేసీఆర్‌లకి కంచ ఐల‌య్య‌ ధ‌న్య‌వాదాలు చెప్పాలి!: టీజీ వెంక‌టేశ్

  • కంచ ఐల‌య్య అమెరికా మిత్రుడు
  • ఆయ‌న గృహ‌ నిర్బంధంలో ఉంటేనే మంచిది
  • కంచ‌ ఐలయ్య కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టారు

'సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లు' అంటూ పుస్త‌కం రాసిన కంచ ఐల‌య్య‌పై రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ మొద‌టి నుంచి విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తోన్న విషయం తెలిసిందే. ఈ రోజు విజ‌య‌వాడ‌లో త‌ల‌పెట్టిన కంచ ఐల‌య్య మ‌ద్ద‌తుదారుల స‌భ‌కు పోలీసుల అనుమతి నిరాకరణ నేప‌థ్యంలో మీడియాతో మాట్లాడిన టీజీ వెంక‌టేశ్‌... కంచ ఐల‌య్య‌ను అమెరికా మిత్రుడిగా అభివ‌ర్ణించారు. ఆయ‌న గృహ‌ నిర్బంధంలో ఉంటేనే మంచిదని అన్నారు.

కంచ‌ ఐలయ్య కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టారని టీజీ విమర్శించారు. త‌న‌ను గృహ నిర్బంధంలో ఉంచినందుకు చంద్రబాబు, కేసీఆర్‌లకి ఐల‌య్య‌ ధన్యవాదాలు తెలుపుకోవాలని ఎద్దేవా చేశారు. ఒకవేళ ఐలయ్య విజయవాడకు వెళ్లి ఉంటే అక్క‌డి ప్రజలు ఆయ‌న‌ను కృష్ణా నది వరకు తరిమి కొట్టేవార‌ని చుర‌క‌లంటించారు.

TG Venkatesh
Telugu Desam Party
KCR
Telangana
ilaiah
  • Loading...

More Telugu News