america: ఉత్తరకొరియాలో భారత్ ఎంబసీ పాత్రపై అమెరికా షాకింగ్ సమాధానం!

  • అవును, ఉత్తరకొరియాలో భారత్ దౌత్యకార్యాలయం ఇంకా మూయలేదు 
  • భారత్ కు రక్షణ, భద్రతా ఒప్పందాల గురించి బాగా తెలుసు
  • ఉత్తరకొరియాతో భారత్ కు కేవలం ఆహారం, మెడికల్ పరమైన దౌత్య బంధాలే వున్నాయి 

ఉత్తరకొరియా-అమెరికాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఉత్తరకొరియాతో సంబంధాలు నెరపే ఏ దేశాన్నైనా అమెరికా శత్రువుగా చూస్తుందన్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా-భారత్ సంబంధాలపై అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్సన్ కు జెనీవాలో ఊహించని ప్రశ్న ఎదురైంది.

ఉత్తరకొరియాలో అమెరికా మిత్రదేశమైన భారత్ దౌత్యకార్యాలయం ఇంకా మూయలేదని ఓ జర్నలిస్టు గుర్తు చేశాడు. ఆ విషయం తనకు తెలుసని, అయినా అది మూయాల్సిన అవసరం లేదని ఆయన బదులిచ్చారు. ఉత్తరకొరియాతో భారత్ కు ఉన్న సంబంధాలు మానవతా సంబంధాలని చెప్పారు.

 ఆహార, వైద్య పరికరాలు మాత్రమే ఉత్తరకొరియాకు భారత్ సరఫరా చేస్తుందని ఆయన తెలిపారు. ఉత్తరకొరియాలోని భారతీయుల రక్షణార్థం ప్యాంగ్యాంగ్ లో చిన్న దౌత్యకార్యాలం మాత్రమే ఉందని ఆయన చెప్పారు. ఐక్యరాజ్యసమితి ఆంక్షల నేపథ్యంలో ఉత్తరకొరియాతో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను భారత్ తెంచుకుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆహార, వైద్య సంబంధాలు మాత్రమే కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

అంతే కాకుండా ఉత్తరకొరియాకు భారత్ తో ఉన్న దౌత్యసంబంధాలు సంప్రదింపులకు మధ్యవర్తిగా ఉపయోగపడనున్నాయని ఆయన షాకింగ్ సమాధానం చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ లకు భద్రత, రక్షణ ఒప్పందాల గురించి బాగా తెలుసని ఆయన తెలిపారు. 

america
south Korea
war
India
Rex tellerson
  • Loading...

More Telugu News