nani: దిల్ రాజు చేతికి నాని 'కృష్ణార్జున యుద్ధం'!

  • నాని తాజా చిత్రంగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి
  • 'తదుపరి చిత్రంగా 'కృష్ణార్జున యుద్ధం'
  • ద్విపాత్రాభినయంలో నాని 
  • దర్శకుడిగా మేర్లపాక గాంధీ

ఒక వైపున వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' చేస్తోన్న నాని, మరో వైపున మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం' చేస్తున్నాడు. సాహు గారపాటి .. హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. పారిస్ నేపథ్యంలో ఒక పాత్ర .. తిరుపతి నేపథ్యంలో మరో పాత్ర కొనసాగుతాయట.

 భిన్నమైన కథా కథనాలతో ఈ సినిమా ఉండటంతో, తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం దిల్ రాజుకు కలిగిందట. నానికి గల క్రేజ్ ను .. ఆయనకి గల మార్కెట్ ను దృష్టిలో పెట్టుకున్న దిల్ రాజు, ఆంధ్ర - తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ను దక్కించుకున్నట్టు చెబుతున్నారు. ఈ కారణంగా ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి. హిపాప్ తమీజా సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.   

  • Loading...

More Telugu News