Wife: భార్యకు అక్రమ సంబంధం అంటగట్టి.. కొట్టి, బయటకు గెంటేసిన యూపీ బీజేపీ నేత.. వీడియో సాక్ష్యాధారాలతో భార్య ఫిర్యాదు!

  • నుపుర్ శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న వినయ్ శర్మ
  • అక్రమ సంబంధం ఆరోపణలు చేస్తూ తాగి హింస
  • అనుచరులతో వచ్చి బట్టలు చించి మరీ కొట్టాడంటూ సాక్ష్యాధారాలతో కేసు

ఆగ్రాలో పీకల్దాక మద్యం తాగి భార్యను హింసించిన బీజేపీ నేతపై భార్య సాక్ష్యాధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో లాయర్స్ కాలనీలోని శివాలిక్ అపార్టుమెంట్స్ లో బీజేపీ సీనియర్ నేత వినయ్ శర్మ, అతని భార్య నుపుర్ శర్మ నివాసం ఉంటున్నారు. నుపుర్ శర్మను వినయ్ శర్మ ప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఉన్నట్టుండి వినయ్ లో ఆమె మీద అనుమానం మొదలైంది.

దీంతో నుపుర్ కు అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ, వినయ్ శర్మ రోజూ పీకల్దాకా మద్యం తాగి ఇంటికి రావడం, ఆమెను చితక్కొట్టడం చేస్తున్నాడు. తాజాగా తన పదిమంది అనుచరులతో పాటు వచ్చి, ఆమె దుస్తులు చించి మరీ కొట్టి, కొడుకుని తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో అవమానంగా భావించిన ఆమె సాక్ష్యాధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వినయ్ శర్మపై పోలీసులు ఐపీసీ 323, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం తన భార్య బంగారు నగలు, నగదును ఎత్తుకెళ్లడమే కాకుండా, తనను చంపుతానని బెదిరిస్తోందంటూ వినయ్ శర్మ ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ రెండు కేసులపై దర్యాప్తు ప్రారంభించారు.

Wife
Husband
bjp leader
police case
bjp
  • Error fetching data: Network response was not ok

More Telugu News