BLOODHOUND: 8 సెకన్లలో 337 కిలోమీటర్ల వేగం అందుకునే కారు వచ్చేస్తోంది.. చూడండి!
- అత్యాధునిక సాంకేతికతో కారు అభివృద్ధి
- వచ్చే ఏడాది మరింత వేగంతో పరీక్షిస్తామని ప్రకటన
- రాకెట్‌తో ఇక పోటీ పడడమే తరువాయి
రాకెట్ వేగంతో పోటీపడే కార్లు వచ్చేస్తున్నాయి. 2020 నాటికి గంటకు 1609 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కార్లను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ‘బ్లడ్‌హౌండ్’ తొలిసారి తమ కారును బహిరంగంగా పరీక్షించింది. ఇంగ్లండ్‌లోని నైరుతి ప్రాంతమైన కార్న్‌వాల్‌లోని న్యూక్వేలోని రన్‌వేపై ‘బ్లడ్ హౌండ్ ఎస్ఎస్‌సీ’ కారును పరీక్షించింది. 8 సెకన్లలోనే 337.9 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని చరిత్ర సృష్టించింది.
ఈ పరీక్షలో ఈ కారు 2.7 కిలోమీటర్లు ప్రయాణించింది. ఫార్ములా వన్ రేస్ కార్లు, జెట్లు, స్పేస్‌షిప్‌ల సాంకేతికతను ఉపయోగించి ఈ కారును రూపొందించారు. రోల్స్ రాయిస్ ఈజే200 జెట్ ఇంజిన్‌ను ఇందులో ఉపయోగించారు. 2020 నాటికి ఈ కారును గంటకు 1,609 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే ఏడాది మరింత వేగంతో పరీక్షిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పరీక్ష విజయవంతం అయినట్టు ప్రకటించారు. కారు ప్రయాణానికి సంబంధించిన వీడియోను మీరూ చూడొచ్చు.