shivasena: అధికార పక్షమా? విపక్షమా? తేల్చుకోండి: శివసేనపై మండిపడిన ఫడ్నవీస్

  • శివసేనకు రెండు నాల్కల ధోరణి తగదు
  • అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్షంలా వ్యవహరించవద్దు
  • ప్రభుత్వానికి సలహాలివ్వండి.. విమర్శించకండి

రెండు నాల్కల ధోరణి అవలంబించవద్దని చెబుతూ శివసేనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ మండిపడ్డారు. మోదీ ప్రభ తగ్గుతోందని, రాహుల్ గాంధీకి దేశాన్ని పాలించగల సత్తా ఉందని వ్యాఖ్యానించిన సంజయ్ రౌత్ నుద్దేశించి ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వంలో కొనసాగాలో, వద్దో శివసేన నిర్ణయించుకోవాలని అన్నారు. తాము తీసుకునే ప్రతి నిర్ణయాన్ని శివసేన వ్యతిరేకిస్తోందని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వానికి సలహాలివ్వాలనుకుంటే ఇవ్వొచ్చు కానీ, ప్రభుత్వంలోనే ఉంటూ విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఏనాడూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని, ప్రస్తుత పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే కూడా అంతేనని ఆయన చెప్పారు. కానీ కొంత మంది ఆ పార్టీ నేతలు అధినేత కంటే తామే గొప్పవారమని భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

  • Loading...

More Telugu News