goutham ganbhir: మ‌రోసారి ట్వీటుతో త‌న దేశభ‌క్తిని చాటుకున్న గౌతం గంభీర్!

  • జాతీయ గీతం వ‌స్తున్న‌ప్పుడు నిల‌బ‌డి ఆల‌పించాల‌ని గ‌తంలో సుప్రీంకోర్టు ఆదేశాలు
  • దేశభక్తిని రుజువు చేసుకోవాలా? అంటూ ప‌లువురి కామెంట్లు
  • జాతీయ గీతం కోసం కేవలం 52 సెకన్లపాటు నిల్చోవ‌డం క‌ష్టమా? అంటూ గంభీర్ ట్వీట్

'క్లబ్ బయట 20 నిమిషాలు వేచిచూస్తాం, ఇష్టమైన రెస్టారెంట్ ఎదుట 30 నిమిషాల పాటు నిల్చుంటాం.. జాతీయగీతం కోసం కేవలం 52 సెకన్లపాటు నిల్చోవ‌డం క‌ష్టమా?' అని ప్రశ్నిస్తూ టీమిండియా ఆట‌గాడు గౌతం గంభీర్ ట్వీట్ చేశాడు. సినిమా హాళ్ల‌ల్లో సినిమా ప్రారంభ‌మ‌య్యే ముందు త‌ప్ప‌ని స‌రిగా జాతీయగీతం ప్ర‌ద‌ర్శించాల‌ని, అది వ‌స్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కులు గౌరవ సూచకంగా లేచి నిల‌బ‌డాల‌ని సుప్రీంకోర్టు గ‌తంలో ఆదేశించిన విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా సుప్రీంకోర్టు మ‌రోసారి ఈ అంశంపై స్పందిస్తూ... దేశభక్తి రుజువు చేసుకోవాలంటే సినిమా హాళ్లలో లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని ఈ విష‌యంపై మ‌రోసారి ఆలోచిస్తామ‌ని తెలిపింది. జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు ఎవరైనా లేచి నిల్చోకపోతే వారిని దేశభక్తి లేనివారిగా పరిగణించలేమని తేల్చి చెప్పింది.

ఈ నేపథ్యంలో పలువురు ప్ర‌ముఖులు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. దేశ భ‌క్తిని ప్ర‌త్యేకంగా చాటు కోవాలా? అంటూ కొందరు మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో గంభీర్ ఈ విధంగా ట్వీట్ చేశాడు. గ‌తంలోనూ గంభీర్ త‌న‌ దేశభక్తిని చాటుతూ ఇటువంటి ట్వీట్లే చేసిన విష‌యం తెలిసిందే. దేశంపై తనకున్న ప్రేమను ఎన్నో సందర్భాల్లో చాటాడు. ఆయ‌న త‌న‌ ఫౌండేషన్‌ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా కొన‌సాగిస్తున్నాడు.  

  • Loading...

More Telugu News