revant reddy: రేవంత్ తో రెండు నిమిషాలు ఏకాంతంగా మాట్లాడిన చంద్రబాబు?

  • రెండు నిమిషాల పాటు విడిగా భేటీ అయిన చంద్రబాబు
  • రేపు అమరావతికి రావాలని ఆదేశం
  • అంగీకరించిన రేవంత్ రెడ్డి

తెలంగాణకు చెందిన 18 మంది టీటీడీపీ నేతలను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడిన చంద్రబాబు, తొలుత ఎవరితోనూ ఏకాంతంగా మాట్లాడేది లేదని చెప్పినప్పటికీ, సమావేశం తరువాత వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన రేవంత్ రెడ్డితో రెండు నిమిషాలు విడిగా భేటీ అయినట్టు తెలుస్తోంది.

ఆ సమయంలో ఇద్దరి మధ్యా జరిగిన మాటామంతీపై వివరాలు తెలియకున్నా, రేవంత్ ను రేపు అమరావతికి రావాలని చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఉదయం 10 గంటలకల్లా అమరావతిలో కలసి వివాదం సమసిపోయేలా చూద్దామని చంద్రబాబు వ్యాఖ్యానించగా, రేవంత్ సైతం సరేనని అంగీకరించినట్టు సమాచారం. చంద్రబాబు ఇప్పటికే అమరావతి బయలుదేరి వెళ్లగా, మిగతా నేతలలో కొందరు రాత్రికి, మరికొందరు రేపు ఉదయం అమరావతికి బయలుదేరనున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News