Uttam Kumar Reddy: తెలంగాణ వ‌స్తే ప్ర‌జాస్వామ్యం మ‌రింత వ‌ర్థిల్లుతుంద‌ని అనుకుంటే దానికి భిన్నంగా ఉంది: ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

  • తెలంగాణ‌లో నిర‌స‌న తెలిపే అవ‌కాశం కూడా లేదా?  
  • రైతులు పండించే పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర రావ‌డం లేదు
  • హ‌మాలీ ఛార్జీలు వ‌సూలు చేయ‌కూడ‌దు
  • రైతుల స‌మ‌స్య‌ల‌పై అత్య‌వ‌స‌రంగా చ‌ర్చ చేప‌ట్టాల‌ని వాయిదా తీర్మానం ఇచ్చాం

తెలంగాణ‌లో రైతులు పండించే పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర రావ‌డం లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. రైతుల స‌మ‌స్య‌ల‌ను గురించి అడుగుదామంటే త‌మ‌కు అవ‌కాశం ఇవ్వలేద‌ని చెప్పారు. తెలంగాణ వ‌స్తే ప్ర‌జాస్వామ్యం మ‌రింత వ‌ర్థిల్లుతుంద‌ని అనుకుంటే దానికి భిన్నంగా ఉందని అన్నారు.

ప్ర‌భుత్వ తీరు న‌చ్చ‌క‌పోతే నిర‌స‌న‌లు చేసుకునే అవ‌కాశం ఇవ్వాలని, దానికి కూడా అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని మండిప‌డ్డారు. రైతుల నుంచి హ‌మాలీ ఛార్జీలు వ‌సూలు చేయ‌కూడ‌దని అన్నారు. ప్ర‌భుత్వం రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారించాలని అన్నారు. రైతుల స‌మ‌స్య‌ల‌పై అత్య‌వ‌స‌రంగా చ‌ర్చ చేప‌ట్టాల‌ని వాయిదా తీర్మానం ఇచ్చామ‌ని, ప్ర‌భుత్వం మొండిగా వ్య‌వ‌హ‌రించిందని ఆయ‌న అన్నారు. 

  • Loading...

More Telugu News