prabhas: హీరో ప్రభాస్ నా లైఫ్.. ఆయన సినిమాలు చూస్తే బాధలన్నీ మరచిపోతా!: యూపీ క్రైమ్ బ్రాంచ్ మహిళా పోలీసాఫీసర్

  • బాహుబలితో దేశవ్యాప్తంగా పాప్యులర్ అయిన ప్రభాస్
  • గత వారంలో 38వ పుట్టిన రోజు
  • వేడుకలు వైభవంగా జరిపిన యూపీ మహిళా పోలీసులు

నిన్నటి వరకూ టాలీవుడ్ హీరోగా ఉండి, 'బాహుబలి'తో దేశవ్యాప్తంగా పాప్యులర్ అయిపోయిన ప్రభాస్ ఇప్పుడు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ అనడంలో ఎంతమాత్రమూ సందేహం లేదు. గత వారంలో ఆయన తన 38వ పుట్టిన రోజు వేడుకలను సింపుల్ గా కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. కానీ, ఆయన అభిమానులు మాత్రం తమ నటుడి బర్త్ డే వేడుకలు ఘనంగానే చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఓ ఆసక్తికర ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఉత్తరప్రదేశ్, అలహాబాద్ నగర పోలీసు విభాగం క్రైమ్ బ్రాంచ్ లో పని చేస్తున్న ఓ మహిళా అధికారిణి ప్రభాస్ కు సూపర్ ఫ్యాన్ అట. ఇక ఆమె ఆధ్వర్యంలో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలను ధూంధాంగా జరుపుకున్నారట. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభాస్ తన లైఫ్ అని, ఎన్నో బాధలను అనుభవించిన తాను, కష్టాల్లో ఉన్న వేళ, ప్రభాస్ సినిమాలు చూసి సాంత్వన పొందేదాన్నని, స్క్రీన్ పై ఆయన్ను చూస్తే బాధలన్నీ మరచిపోయేదాన్నని చెప్పుకొచ్చారు. ఆయన్ను తెరపై చూస్తే తనకెంతో ఆనందం కలుగుతుందని, అతనే తనకు ప్రేరణని చెప్పారు. ఇక తమ విషెస్, అభిమానం ప్రభాస్ కు చేరాలని కోరుకుంటున్నట్టు ఆమె చెప్పిన మాటలు ప్రభాస్ కు చేరాయో? లేదో!

prabhas
up
lady police
  • Loading...

More Telugu News