apple i phone x: అరగంటలోనే ఔట్ ఆఫ్ స్టాక్ అయిన యాపిల్ ఎక్స్ ఫోన్లు!
- ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్లో 12:31 గం.కి ప్రారంభమైన ప్రీ ఆర్డర్ సేల్
- 01:00 గం.కి ఔట్ ఆఫ్ స్టాక్
- ఫ్లిప్‌కార్ట్ అందించిన ఆఫర్లే కారణం
ఇవాళ మధ్యాహ్నం 12:31 గం.కి ఆన్‌లైన్ మార్కెట్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఐఫోన్ ఎక్స్ ప్రీ ఆర్డర్ సేల్ ప్రారంభమైంది. సేల్ ప్రారంభమైన అరగంటకే ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ ఔట్ ఆఫ్ స్టాక్ ఆప్షన్ పెట్టేసింది. మళ్లీ స్టాక్ వచ్చాక తెలియజేయడానికి `నోటిఫై మీ` ఆప్షన్ ద్వారా ఈ-మెయిల్ ఐడీ తెలియజేయాలని కోరుతోంది. అయితే ఇంత త్వరగా యాపిల్ ఐఫోన్ ఎక్స్ అమ్ముడవడానికి కారణం ఫ్లిప్‌కార్ట్ వారు అందజేస్తున్న ఆఫర్లే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సిటీ క్రెడిట్, సిటీ వరల్డ్ డెబిట్ కార్డుల ద్వారా ప్రీబుక్ చేసుకున్న వారికి రూ. 22,000ల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది. అదనంగా ఫ్లిప్‌కార్ట్ కూడా రూ. 10వేల తగ్గింపు ప్రకటించింది. ఆపిల్ ఎయిర్‌పాడ్‌తో పాటు ఐఫోన్ ఎక్స్ బుక్ చేసుకున్నవారికి రూ. 15,000ల క్యాష్‌బ్యాక్, ఆపిల్ వాచ్‌తో కలిపి బుక్ చేసుకుంటే రూ. 22వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా వాయిదా పద్ధతి, బయ్‌బ్యాక్ వాల్యూ వంటి చాలా ఆఫర్లు ఉన్నాయి. ఆపిల్ ఐఫోన్ ఎక్స్ ధర రూ. 89వేల నుంచి రూ. 1,02,000 వరకు ఉంది.