revant reddy: చంద్రబాబుతో సమావేశానికి హాజరైన రేవంత్ రెడ్డి!

  • అధినేతపై నమ్మకం ఉందన్న రేవంత్ రెడ్డి
  • లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు వచ్చిన రేవంత్
  • అన్ని ఆరోపణలకూ చంద్రబాబు ముందే సమాధానం
  • మొత్తం 18 మందికి చంద్రబాబు పిలుపు

తనకు తెలుగుదేశం పార్టీ అధినేతపై పూర్తి నమ్మకం ఉందని తెలంగాణలో టీడీపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుని, ఇప్పుడు కాంగ్రెస్ లోకి ఫిరాయిస్తారని భావిస్తున్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం చంద్రబాబు పిలుపు మేరకు సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్న ఆయన, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు వచ్చారు.

అంతకుముందు మీడియాతో మాట్లాడిన ఆయన, మీడియాలో వస్తున్న అన్ని కథనాలకు తనను బాధ్యుడిని చేయడం సరికాదని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలన్నింటికీ చంద్రబాబు ఎదుటే సమాధానం ఇస్తానని, ఆయనతో మాట్లాడిన తరువాత తన నిర్ణయం వెల్లడిస్తానని తెలిపారు. కాగా, ఈ సమావేశానికి మొత్తం 18 మందిని చంద్రబాబు ఆహ్వానించారు. వారందరికీ చంద్రబాబు వ్యక్తిగత సిబ్బంది స్వయంగా ఫోన్లు చేసి ఆహ్వానించారని తెలుస్తోంది.

revant reddy
congress
Telugudesam
chandrababu
  • Loading...

More Telugu News