housefull: 2019 దివాలీకి రానున్న `హౌస్‌ఫుల్ 4` చిత్రం

  • పున‌ర్జ‌న్మ క‌థాంశంతో రానున్న చిత్రం
  • ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్న సాజిద్ ఖాన్‌
  • ప్ర‌క‌టించిన నిర్మాణ సంస్థ‌

హిందీ కామెడీ చిత్రాలు ఇష్ట‌ప‌డే వారికి `గోల్‌మాల్‌`, `హౌస్‌ఫుల్‌` చిత్రాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర‌లేదు. ఇటీవ‌ల దివాలీకి `గోల్‌మాల్` చిత్ర నాలుగో భాగం `గోల్‌మాల్ అగైన్‌` వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. ఈ నేప‌థ్యంలో కామెడీ అభిమానుల‌కు మ‌రో శుభ‌వార్త‌ను వినిపించారు `హౌస్‌ఫుల్` చిత్ర నిర్మాత‌లు.

వ‌చ్చే దివాలీకి `హౌస్‌ఫుల్ 4` విడుద‌ల చేస్తామ‌ని, ఈ చిత్రం పున‌ర్జ‌న్మ క‌థాంశం మీద న‌డుస్తుంద‌ని నిర్మాణ సంస్థ న‌డియాడ్‌వాలా గ్రాండ్‌స‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్ర‌క‌టించింది. ఈ సిరీస్‌లో మొద‌టి రెండు చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వహించిన సాజిద్ ఖాన్ ఈ నాలుగో భాగానికి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్న‌ట్లు తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన ఇంకా న‌టీన‌టుల‌ను నిర్ణ‌యించాల్సి ఉంద‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

More Telugu News