l ramana: నేను చీకటి ఒప్పందాలు చేసుకునే రకం కాదు.. రేవంత్ ఎక్కడి నుంచి వచ్చాడో అందరికీ తెలుసు: ఎల్.రమణ

  • నేను డబ్బు కోసం చీకటి ఒప్పందాలు చేసుకునే రకం కాదు
  • విమర్శలకు వివరణ ఇవ్వాలనే అడుగుతున్నాం
  • చంద్రబాబుతో భేటీలో నిర్ణయం తీసుకుంటాం

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మరోసారి విమర్శలు గుప్పించారు. ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబం నుంచి తాను వచ్చానని... రేవంత్ రెడ్డి ఎక్కడ నుంచి వచ్చారో అందరికీ తెలుసని ఆయన అన్నారు. డబ్బు కోసం చీకటి ఒప్పందాలు చేసుకునే రకం తాను కాదని చెప్పారు. కాంగ్రెస్ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి, రేవంత్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.

గతంలో స్టార్ హోటళ్లలో నిర్వహించిన సమావేశాలకు రేవంత్ హాజరయ్యారని... ఆ సమావేశాలకు డబ్బు ఎవరు పెట్టారని అప్పుడు వచ్చారని రమణ ప్రశ్నించారు. రేవంత్ చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలనే తాము కోరుతున్నామని... అంత వరకు ఆయనను పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించబోమని స్పష్టం చేశారు. కాసేపట్లో తమ అధినేత చంద్రబాబుతో జరిగే భేటీలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ రోజు హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, రమణ పైవ్యాఖ్యలు చేశారు.

l ramana
revanth reddy
tTelugudesam
chandrababu
congress
  • Loading...

More Telugu News