narendra modi: మోదీపై విమర్శలు, రాహుల్ పై ప్రశంసలు కురిపించిన శివసేన

  • మోదీ ప్రతిష్ఠ మసకబారుతోంది
  • రాహుల్ గాంధీ సమర్థవంతమైన నేతగా కనిపిస్తున్నారు
  • గుజరాత్ ఎన్నికల్లో రాహుల్ ప్రభావాన్ని అందరూ చూస్తారు

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠ రోజురోజుకూ దిగజారుతోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఇదే సమయంలో మన దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించేలా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కనిపిస్తున్నారంటూ కితాబిచ్చారు. ఓ టీవీ చర్చాకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు దేశ ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశాయని విమర్శించారు. ఈ రెండింటివల్ల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందని చెప్పారు.

దేశంలో చాలా మంది నేతలు తమకుతామే గొప్ప అని విర్రవీగుతున్నారని... రాహుల్ ను 'పప్పు' అని సంబోధిస్తున్నారని సంజయ్ రౌత్ అన్నారు. రానున్న రోజుల్లో రాహుల్ ప్రభావం ఏంటో అందరికీ తెలుస్తుందని చెప్పారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో రాహుల్ స్పష్టమైన ప్రభావం చూపే పరిస్థితి నెలకొందని అన్నారు. దేశాన్ని సమర్థవంతంగా నడిపించే శక్తి రాహుల్ కు మాత్రమే ఉందని చెప్పారు.

narendra modi
sanjay raut
rahul gandhi
bjp
sivsena
congess
gujarat elections
himachal pradesh elections
  • Loading...

More Telugu News