Rahul Gandhi: భారత ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది: రాహుల్ గాంధీ చురకలు
- జైట్లీ మెడిసిన్లకు ఆర్థిక వ్యవస్థకు పట్టిన జబ్బును నయం చేసే శక్తి లేదు
- పాతనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల నష్టం వాటిల్లింది
- జైట్లీని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు
కొన్ని రోజులుగా ట్విట్టర్ ఖాతా ద్వారా బీజేపీ నేతలపై ఘాటైన విమర్శలు చేస్తోన్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అదే దూకుడును కొనసాగిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్‌గా పేర్కొన్న రాహుల్ గాంధీపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ మండిపడుతూ.. 2జీ స్కామ్, కోల్ స్కామ్‌లో ఇరుక్కున్న పార్టీ నేతలకి జీఎస్టీ ట్యాక్స్ గురించి అభ్యంతరాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.
అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ ఈ రోజు మరో చురక అంటించారు. పాతనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఐసీయూలో ఉందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అరుణ్ జైట్లీ మెడిసిన్లకు (ఆలోచనా శక్తికి) ఆర్థిక వ్యవస్థకు పట్టిన జబ్బును నయం చేసే శక్తి లేదని చురకలంటించారు.