revanth reddy: ఉదయం టీడీపీ ఆఫీసులో ఉండి, సాయంత్రం కేసీఆర్ ను కలిసేవాళ్లకు సమాధానం చెప్పను: రేవంత్

  • టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేల సమావేశానికి హాజరుకాని రేవంత్
  • ప్రజా సమస్యలను చర్చించడానికి స్టార్ హోటల్ ఎందుకు?
  • తెలంగాణకు గులాబీ చీడ పట్టిందంటూ వ్యాఖ్య

తనను టార్గెట్ చేసిన టీటీడీపీ నేతలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గోల్కొండ హోటల్ లో నిర్వహిస్తున్న సమావేశానికి తాను ఎందుకు వెళ్లాలని ఆయన ఆడిగారు. ఉదయం పూట టీడీపీ కార్యాలయంలో ఉండి, సాయంత్రం కాగానే కేసీఆర్ ను కలిసేవాళ్లకు తాను సమాధానాలు చెప్పనని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను చర్చించడానికి స్టార్ హోటల్ ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణకు గులాబీ చీడ పట్టిందని... దాన్ని వదిలించేందుకు రకరకాల మందులు కొడతామని అన్నారు. ఈ రోజు గోల్కొండ హోటల్ లో జరిగిన టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేల సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. 

revanth reddy
tTelugudesam
bjp
kcr
telangana cm
  • Loading...

More Telugu News