india america nuclear deal: భారత్-అమెరికాల మధ్య అణు ఒప్పందం ఓ విఫల ప్రయోగం: అమెరికా మాజీ సెనేటర్

  • ముందస్తు కసరత్తు లేకుండానే ఒప్పందం జరిగింది
  • ఆయుధ కంపెనీలకు మేలు చేసేలా ఒప్పందం
  • ఒబామా పర్యటన ఆయుధాల అమ్మకాల కోసమే

భారత్, అమెరికా దేశాల మధ్య జరిగిన పౌర అణు ఒప్పందం ఓ విఫల ప్రయోగమని అమెరికా మాజీ సెనేటర్ లారీ ప్రెస్లర్ అన్నారు. గతంలో ఈయన యూఎస్ సెనేట్ ఆయుధ నియంత్రణ సబ్ కమిటీకి ఛైర్మన్ గా వ్యవహరించారు. ఎలాంటి ముందస్తు కసరత్తు లేకుండానే ఈ ఒప్పందాన్ని తెరపైకి తీసుకొచ్చారని... ఆ తర్వాత డిఫెన్స్ ఆయుధ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే ఒప్పందంలా దీన్ని మార్చారని ఆయన విమర్శించారు. ఎలాంటి గ్రౌండ్ వర్క్ లేకుండానే ఒప్పందంపై సంతకాలు చేశారని... దీంతో, ఆదిలోనే ఈ ఒప్పందానికి తూట్లు పడ్డాయని చెప్పారు. 2008 అక్టోబరులో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయని, అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ లో పర్యటించారని... అయితే, అది కేవలం ఆయుధాల విక్రయం కోసం చేపట్టిన యాత్ర మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తున్నాయి. 

india america nuclear deal
lary plesler
  • Loading...

More Telugu News