runway: ర‌న్ వే మీద డ్యాన్స్ వేసిన విమాన సిబ్బంది... వైర‌ల్ అవుతున్న వీడియో

  • న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో ఘ‌ట‌న‌
  • సిగ్న‌ల్ లైట్స్ ప‌ట్టుకుని డ్యాన్స్ చేసిన కైర‌న్ యాష్‌ఫ‌ర్డ్‌
  • ప్ర‌యాణికుల‌ను సంతోష‌పెట్ట‌డ‌మే ల‌క్ష్యమ‌న్న కైర‌న్‌

ఎయిర్‌పోర్ట్ ర‌న్ వే మీద డ్యాన్స్ చేస్తున్న ఓ విమాన సిబ్బంది వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లోని సౌత్‌వెస్ట్ ఎయిర్‌వేస్‌లో సిగ్న‌ల్ మ్యాన్‌గా ప‌నిచేసే కైర‌న్ యాష్‌ఫ‌ర్డ్ స్టెప్పులు వేస్తుండ‌గా విమానంలో ప్ర‌యాణిస్తున్న ఓ వ్య‌క్తి వీడియో తీశాడు. కైర‌న్ వేస్తున్న ఫ‌న్నీ స్టెప్పులు అంద‌రికీ న‌వ్వు తెప్పిస్తున్నాయి.

అయితే త‌న డ్యాన్స్ వ‌ల్ల క‌నీసం ఒక్క ప్ర‌యాణికుడినైనా 30 సెక‌న్ల పాటు సంతోష పెట్ట‌గ‌లిగితే చాల‌ని, అందుకే విమానం టేకాఫ్ అవుతుండగా తాను అలా స్టెప్పులు వేస్తాన‌ని కైర‌న్ చెప్పాడు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో ఐదేళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన కైర‌న్‌, చాలా డ్యాన్స్ పోటీల్లో త‌మ సంస్థ త‌ర‌ఫున పాల్గొన్న‌ట్లు తెలుస్తోంది.

runway
flight attendant
signal man
new york
viral video
dancing
  • Error fetching data: Network response was not ok

More Telugu News