hrithik roshan: మాజీ భార్య సుజానే పుట్టిన‌రోజు వేడుక‌ల‌కు హాజ‌రైన హృతిక్ రోష‌న్‌!

  • ఫొటోలు పోస్ట్ చేసిన సుజానే ఖాన్‌
  • హాజ‌రైన ట్వింకిల్ ఖ‌న్నా, క‌రణ్ జొహార్‌
  • విడాకులు తీసుకున్నా స్నేహితుల్లా మెలుగుతున్న హృతిక్‌, సుజానే

బాలీవుడ్ న‌టుడు హృతిక్ రోష‌న్ మాజీ భార్య సుజానే ఖాన్ త‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ను స్నేహితులు, కుటుంబ స‌భ్యులతో ఘ‌నంగా జ‌రుపుకుంది. ఈ వేడుక‌ల‌కు హృతిక్ రోష‌న్ కూడా హాజ‌ర‌వ‌డం విశేషం. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోల‌ను సుజానే ఖాన్ త‌న ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేసింది.

`న‌న్ను, నా జీవితాన్ని ప్ర‌త్యేకంగా మార్చిన వారందరికీ కృత‌జ్ఞ‌త‌లు` అంటూ ఆమె ఫొటో పోస్ట్ చేసింది. ఈ వేడుక‌కు సుజానే సొద‌రుడు జాయెద్ ఖాన్‌, అత‌ని భార్య మ‌లైకాల‌తో పాటు సుజానే స్నేహితులు ట్వింకిల్ ఖ‌న్నా, క‌ర‌ణ్ జొహార్‌లు కూడా హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. విడాకులు తీసుకున్న‌ప్ప‌టికీ హృతిక్‌, సుజానేలు ఇప్ప‌టికీ స్నేహితుల్లాగే కొన‌సాగుతున్నారు. హృతిక్ ఇంట్లో జ‌రిగే వేడుక‌ల‌కు కూడా సుజానే హాజ‌ర‌వుతుంది. ఇటీవ‌ల కంగ‌నాతో హృతిక్ వివాదంలో సుజానే అత‌నికి అండ‌గా నిల‌బ‌డింది. వారికి హ్రేహాన్‌, హ్రిదాన్ అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

hrithik roshan
suzzane khan
birthday celebrations
kangana ranaut
twinkle khanna
karan johar
  • Loading...

More Telugu News