Reliance: టారిఫ్ ధరను మళ్లీ పెంచిన జియో.. వారం రోజుల వ్యవధిలో రెండోసారి!

  • రూ. 491 రీచార్జ్ ప్యాక్ ధర పెంపు
  • అధికారికంగా ప్రకటన నిల్
  • జియో యాప్‌లో దర్శనమిస్తున్న రూ.499 ప్యాక్

వారం రోజుల క్రితం టారిఫ్ ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్న రిలయన్స్ జియో ఇప్పుడు మరోమారు టారిఫ్ ధరను పెంచింది. ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం దీపావళి సందర్భంగా రూ.491 రీచార్జ్ ప్యాక్‌ను తీసుకొచ్చిన జియో ఇప్పుడు దానిపై మరో రూ. 8 పెంచింది. దీంతో ఇకపై ఈ ప్యాక్ రూ.499కి అందుబాటులో ఉంటుంది.

ఈ ప్లాన్‌లో భాగంగా వినియోగదారులు రోజుకు 1 జీబీ డేటా చొప్పున 91 రోజులపాటు హైస్పీడ్ 4జీ డేటాను అందుకోవచ్చు. ప్రస్తుతం జియో అందిస్తున్న ప్లాన్లలో ఎక్కువ కాలపరిమితి ఉన్న ప్యాక్ ఇదే. టారిఫ్ ధరను రూ.8 పెంచిన జియో దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. జియో వెబ్‌సైట్‌లోనూ ధర పెంపునకు సంబంధించిన వివరాలు లేవు. అయితే జియో యాప్‌లో మాత్రం రూ.491 బదులు రూ. 499 కనిపిస్తోంది. 

Reliance
jio
reacharge
pak
hike
  • Loading...

More Telugu News