tippu sultan: టిప్పు సుల్తాన్ కు ప్రశంసలు... బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టిన రాష్ట్రపతి ప్రసంగం!

  • టిప్పు సుల్తాన్ ను వీరుడిగా కీర్తించిన రాష్ట్రపతి
  • కోవింద్ వ్యాఖ్యలతో బీజేపీకి షాక్
  • టిప్పును ద్రోహిగా అభివర్ణిస్తున్న బీజేపీ

టిప్పు సుల్తాన్ ను ద్రోహిగా అభివర్ణిస్తున్న బీజేపీకి రాష్ట్రపతి కోవింద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయి. కర్ణాటక విధానసౌధ 60వ వార్షికోత్సవం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, బ్రిటీష్ వారితో పోరాడుతూ టిప్పు సుల్తాన్ వీరోచితంగా మరణించాడని అన్నారు. చారిత్రక పోరాటంలో టిప్పు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

 కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టిప్పు సుల్తాన్ జయంత్యుత్సవాలను బీజేపీ నేతలు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మైసూర్ పాలకుడిగా వేలాది మంది హిందువులు, క్రిస్టియన్ లను టిప్పు సుల్తాన్ హతమార్చాడని... మత మార్పిడులకు పాల్పడ్డాడని బీజేపీ ఎమ్మెల్యే అశ్వంత్ నారాయణ్ పేర్కొనడం దుమారం రేపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు బీజేపీతో విభేదిస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

tippu sultan
bjp
congress
vidhan souda
  • Loading...

More Telugu News