robo 2.0: `రోబో 2.0` కొత్త పోస్టర్ చూశారా?... ఫొటో విడుదల చేసిన దర్శకుడు శంకర్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-a5ce87172df5a7cdf889d5000978d462821e674c.jpg)
- అమీ జాక్సన్ రోబోతో ప్రేమలో పడిన చిట్టి రోబో?
- అక్టోబర్ 27న ఆడియో విడుదల
- ఆసక్తి కలిగిస్తున్న కొత్త పోస్టర్
`రోబో 2.0` చిత్రానికి సంబంధించి శుక్రవారం దుబాయ్‌లో ఆడియో విడుదల వేడుక జరగనున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు శంకర్ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నాడు. ఇటీవల అమీ జాక్సన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాక, ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న పాత్ర గురించి ఓ స్పష్టత వచ్చింది. లేడీ రోబో పాత్రలో ఉండే అమీ జాక్సన్, రజనీకాంత్ చిట్టి రోబోల మధ్య ప్రేమకు సంబంధించిన సన్నివేశాలు ఉండొచ్చని ఈ కొత్త పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. మరి వీళ్లిద్దరికీ అక్షయ్ కుమార్ డా. రిచర్డ్ పాత్రకు ఎలాంటి సంబంధం ఉంటుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఈ పోస్టర్ కంటే ముందు ఒక రోబో చేయి, ఏలియన్ చేయి పియానో వాయిస్తున్నట్లుగా ఉండే ఫొటోను కూడా శంకర్ షేర్ చేశాడు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-5237dddd68e75f04d457337761b17d80956b7ace.jpg)