ys jagan: జగన్ ఓ అరాచకవాది.. 2019లోగా జైలుకు వెళ్లడం ఖాయం: కేఈ

  • మాల్యా, లాలూలకు మించిన కేసులున్నాయి
  • చట్టసభలు, న్యాయ వ్యవస్థపై ఆయనకు నమ్మకం లేదు
  • జగన్ వల్ల రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోంది

2019 ఎన్నికల్లోగా వైసీపీ అధినేత జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి జోస్యం చెప్పారు. విజయ్ మాల్యా, లాలూ ప్రసాద్ యాదవ్ కు మించిన కేసులు జగన్ పై ఉన్నాయని అన్నారు. ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో వాకౌట్ చేయడమే పనిగా పెట్టుకున్న జగన్... ఇప్పుడు ఏకంగా అసెంబ్లీనే బహిష్కరించాలని అనుకుంటున్నారని విమర్శించారు. చట్టసభలు, న్యాయ వ్యవస్థపై జగన్ కు గౌరవం లేదని అన్నారు. ఓ అరాచకవాదిలా రాష్ట్రంలో గొడవలు సృష్టిస్తున్నారని చెప్పారు. జగన్ చర్యలతో రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోందని మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కేఈ పైవ్యాఖ్యలు చేశారు.

ys jagan
ysrcp
ke krishna murthy
Telugudesam
ap deputy cm
  • Loading...

More Telugu News